Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసర ల్యాండింగ్
లండన్ : లండన్ నుంచి హ్యూస్టన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో మాంచెస్టర్కి చెందిన డారెన్ హలివేల్ అనే వ్యక్తి తన భార్యపై భౌతిక దాడికి దిగడంతో విమానాన్ని బోస్టన్లోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించినట్లు అధికారులు తెలిపారు. తోటి ప్రయాణికులు అడ్డుకోగా వారిపై మండిపడ్డాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించి అతడిని పోలీసులకు అప్పగించారు. విమాన సిబ్బంది, ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం విమానం హ్యూస్టన్కి తిరిగి ప్రయాణమైనట్లు అధికారులు చెప్పారు.