Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టొరంటో: కెనడాలోని దక్షిణ ఆల్బర్టా ప్రాంతంలో కొమ్ముల డైనోసర్ అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 79 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ డైనోసర్ భూమిపై సంచరించి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇది దాదాపు టన్ను బరువు, 6 మీటర్ల పొడవు ఉంటుందని, చిలుక ముక్కును పోలిన ముక్కు, ఆకు ఆకారంలో డజన్ల కొద్ది దంతాలున్నాయని తెలిపారు. ఈ డైనోసర్ శాకాహారి అయి ఉంటుందన్నారు. డైనోసర్లన్నింటిలోనూ అతి పెద్ద డైనోసర్గా దీనిని గుర్తించామని చెప్పారు. భూమి మీద ఉన్న కొత్త జాతుల కోసం అన్వేషిస్తుండగా వీటి ఆనవాళ్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు.