Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి
బెర్లిన్ : జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బవేరియాలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒక మహిళ వుంది. పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. కానీ అతడి వివరాలు వెల్లడించలేదు. టైఫెంతాల్ పట్టణంలో దుండగుడు మెర్సిడెజ్ బెంజ్ కారులో వచ్చి ఓ మహిళను కాల్చి పరారయ్యాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అదే వ్యక్తి కారులో వెళ్తూ సమీప పట్టణంలో సైకిల్‌పై వెళ్తున్న మరో వ్యక్తిని దారుణంగా కాల్చి చంపేశాడు. అంతేకాకుండా సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై, మరో వాహనం డ్రైవర్‌పై కూడా కాల్పులు జరిపాడు. కానీ వారికి ఎలాంటి హానీ కలుగలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసులు దుండగుడ్ని అరెస్టు చేసి, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.