Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో : వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ కార్యాచరణ, ఎజెండాను ఇప్పుడే ప్రకటించలేమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. యునై టెడ్ రష్యా పార్టీ ఎజెండాను ప్రకటించినట్టయితే దాని ప్రభా వం కచ్చితంగా పరిపాలన వ్యవహారాలపై పడుతుంద న్నారు. 'రానున్న అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎజెండాను ముందస్తుగా ప్రకటించినట్టయితే...దాని ప్రభావం దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలతో పాటు ఉద్యోగులపై ఉంటుంది. వారంతా పనిచేయడం మానేసి ఎన్నికల గురించి ఆలోచించ డం ప్రారంభిస్తారు.
ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారోనని ఊహించేందుకే వారి అమూల్యమైన సమయాన్ని కేటాయి స్తారు. ఇలాంటి పరిణామాలను నేను ఎంత మాత్రం అంగీ కరించను' అని పుతిన్ అన్నారు. చైనాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా మీడియాతో పుతిన్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత తమ ఎజెండాను ప్రకటిస్తామని అన్నారు. దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల చట్టాల ప్రకారం...అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన 45 నుంచి 80 రోజులో పార్టీ ఎజెండాను ప్రక టించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, రష్యాలో వచ్చే ఏడాది మార్చి18న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈ ఏడాది ఎన్నికల్లో లిబరల్ యబ్లోకో పార్టీ వ్యవస్థాపకులు గ్లిగోరీ యావ్లిన్స్కై, ఎల్డీపీఆర్ జాతీయపార్టీ చీఫ్ వ్లాదిమిర్ జిరినోవ్స్కీ, అవినీతి నిర్మూలనకై పోరాడుతున్న సామాజిక కార్యకర్త అలెక్సీ నవాల్లీ పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. రష్యాలో ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ మాత్రం తమ అభ్యర్థి పేరును ఇంత వరకు వెల్లడించలేదు.
సిరియాలో వైమానిక దాడులు నిలిపివేయాలి
ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు, సిరియా సైన్యం నిర్వహిస్తున్న జాయింట్ ఆపరేషన్ను ఇకనైనా నిలిపివేయాలని మెజారిటీ రష్యన్లు వేడుకుంటు న్నారు. రష్యాలోని 49శాతం పైగా పౌరులు సిరియాలో ఏరులై పారుతున్న రక్తపాతానికి చరమగీతం పాడాలని కోరుతున్నారు. రష్యాలో వైమానిక దాడులను కొనసాగిం చాలని 30 శాతం మంది పౌరులు, ఈ అంశంపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేమని 22శాతం మంది ప్రజలు పేర్కొ న్నారు. సిరియాలో వైమానిక దాడుల్లో రష్యా బలగాలు పాల్గొనాలా ? వద్దా ? అనే అంశంపై లెవాడా సెంటర్ సర్వే నిర్వహించింది. దానికి సంబంధించిన వివరాలను బుధ వారం విడుదల చేసింది. దానిలోని వివరాల ప్రకారం... సిరియాలో వైమానిక దాడులను నిలిపివేయాలని మెజారిటీ రష్యన్లు కోరుతున్నారు. 2015లో ఇదే సంస్థ నిర్వహించిన పోల్లో సిరియా బలగాలు నిర్వహిస్తున్న వైమానిక దాడులకు రష్యా సైన్యం తప్పకుండా సహకరించాలని 70శాతం మంది పౌరులు మద్దతు తెలిపారు. సిరియాలో ఐఎస్ మారణహోమం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల అరాచకాలను తిప్పిగొట్టేందుకు తమకు సహకరించాలని సిరియా అధ్యక్షుడు అస్సద్ రష్యా సహకారం కోరారు. దీంతో, 2015 నుంచి రష్యా బలగాలు సిరియా సైన్యంతో కలిసి జాయింట్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి.
వేలాది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. సిరియాలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్టు గతేడాది మార్చి14న పుతిన్ ప్రకటించారు. ఆ దేశంలో ఉన్న బలగాలను వెనక్కి రావాలని ఆదేశించారు. అయితే, కొంతమంది రష్యన్ సైనికులు మాత్రం అక్కడే ఉండిపోయారు. సిరియా బలగాలకు యుద్ధ మెలకువలు నేర్పిస్తున్నారు. సిరియా బలగాలతో కలిసి జాయింట్ ఆపరేషన్లో పాల్గొంటు న్నారు.