Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెక్సాస్ : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లో దుండగుడు ఓ ఇంట్లో కాల్పులతో రెచ్చిపోయాడు. ఫలితంగా అతడితో సహా ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. ఉత్తర డల్లాస్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసు కున్నది. డల్లాస్‌లో కౌబార్సు ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పార్టీ నిర్వహించారు. ఈ సమయంలో ఓ దుండగుడు ఇంట్లోకి చొర బడి అక్కడ ఉన్న యువతితో గొడవపెట్టు కున్నాడు. అనంతరం తుపాకీతో విచ్చల విడిగా కాల్పులు జరిపాడు.