Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలి గేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై 13 గంటల చర్చ జరిగింది. అనుకూలంగా 326, వ్యతిరేకంగా 290ఓట్లు వచ్చాయి. ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ చేరికకు ఉద్దేశించిన 1972 చట్టాన్ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం 12వేల ఈయూ నిబంధనలను బ్రిటన్ చట్టాల సంపుటికి బదలాయించే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గతేడాది బ్రెగ్జి ట్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ ప్రజలు చారిత్రాత్మ క తీర్పునిచ్చిన తర్వాత ఆ దిశగా తీసుకున్న తదుపరి చర్య ఇది.