Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదల్లో చిక్కుకుని 10 మంది మృతి
హవానా : అమెరికాను అతలాకుతలం చేసిన ఇర్మా తుఫాను క్యూబాను తాకింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని 10 మంది మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. తుఫాను ధాటికి హవానాలోని ఓ చారిత్రక భవనం పూర్తిగా దెబ్బతిన్నది. సెంట్రల్ హవానాలోని ఓ పురాతన భవనం, పలు హోటళ్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తున్నది. ప్రజలను ఇండ్లల్లోనే ఉండిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగమయ్యారు. కాగా, 2005లో క్యూబాలో డెన్సిస్ తుఫాను సంభవించినప్పుడు 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.