Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : సిరియా ప్రభుత్వం నిర్వహిస్తున్న పునరావాస చర్యలకు తమ వంతు సాయం అందించనున్నట్టు రష్యా పేర్కొన్నది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం ప్రారంభమై న సంగతి తెలిసిందే. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో వేలాది మంది మృతి చెం దారు. ఉగ్రసంస్థల బాంబు దాడుల్లో వేలాది ఇండ్లు, ఆస్ప త్రులు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. నిరాశ్రయులైన ప్రజలకు పునరావాసం కల్పించాలని అస్సద్ సర్కార్ నిర్ణయించుకు న్నది. ఈబృహత్కార్యానికి తమ వంతు సహకారం అందజే యనున్నట్టు రష్యా తెలిపింది. 4వేల టన్నుల పైపులు, కేబుల్స్, యంత్రాలను సిరియాకు తరలించినట్టు పేర్కొన్నది. సిరియాలోని ఉగ్రసంస్థలను పారద్రోలేందుకు అస్సద్ సర్కార్కు రష్యా సహకరిస్తున్న సంగతి తెలిసిందే.