Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 177 దేశాలను చుట్టివచ్చే అవకాశం 500 మందికే
సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే ప్రతిఒక్కరికీ పాస్‌పోర్టు కచ్చితంగా ఉండాల్సిందే. దీంతో, పాటు ఏ దేశానికి వెళ్లాలను కుంటున్నామో ఆ దేశ ప్రభుత్వం అనుమతిస్తూ జారీచేసిన వీసా కూడా కావాలి. సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా ఆమోద ముద్ర వేసి ఇచ్చిన పాస్‌పోర్టుకు వీసా అక్కర్లేదట. ఈ పాస్‌పోర్టు చూపించి ప్రపంచంలోని 177 దేశాలను చుట్టి రావచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 మందికి మాత్రమే ఈ పాస్‌పోర్టును మంజూరు చేస్తారు. సావరిన్ మిలిటరీ అంటే ఓ రోమన్ క్యాథలిక్ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో సేవలు అందిస్తోంది. వైద్య, సామాజిక, మానవతా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు అండగా ఉండటమే దీని ప్రధాన ధ్యేయం. ఈ సంస్థ తెలిపిన సమచారం మేరకు.. కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఈ రకం పాస్‌పోర్టులను మంజూరు చేస్తారు. సావరిన్ కౌన్సిల్లో సభ్యులకు, దౌత్య కార్యకలాపాలు సాగించేవారికి మాత్రమే ఈ పాస్‌పోర్టులు మంజూరు చేస్తారట. మనం ఏ పని మీద దేశానికి వెళుతున్నామో పాస్‌పోర్టు మీద రాయాల్సి ఉంటుంది. దీని కాల పరిమితి కేవలం 4 సంవత్సరాలు ఉంటుంది.