Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: రష్యాకు చెం దిన ప్రొ-మొబో ల్యాబొ రేటరీస్ రూపొందించిన రోబో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసింది. పెర్మ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐటీ ప్రదర్శనకు పుతిన్ హాజరయ్యారు. అక్కడ ప్రొ-మొబో రోబో సందడి చేసింది. ఏ మనిషినైనా ఒక్కసారి చూస్తే ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఈ రోబో.. పుతిన్‌ని చూడగానే షేక్‌హ్యాండ్ ఇచ్చింది.ఈ రోబోని గైడ్‌గా, ప్రమోషనల్ సేల్స్‌మ్యాన్‌గా ఉపయోగిస్తారు. 2016లో ఓసారి ల్యాబ్ తలుపులు తెరిచి ఉండడంతో బయటకు వెళ్లిపోయి.. రోడ్డుకు అడ్డంగా నిలబడింది. దాంతో చాలా సేపటి వరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మాస్కోలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రష్యాకు చెందిన వలెరి కలషెవ్ అనే అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోనూ ప్రొ-మొబో పాల్గొనడం వైరల్ అయింది.