Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమైకా : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ వయోలెంట్ బ్రౌన్ తుది శ్వాస విడిచింది. ఆమె వయసు 117 ఏండ్లు. జమైకాకు చెందిన ఈ బామ్మను అత్యంత వృద్ధ మహిళగా ఈ ఏడాది ఏప్రిల్లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. 1900 సంవత్సరం మార్చి 10వ తేదీన బ్రౌన్ జన్మించింది. జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ పుట్టిన ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ బామ్మ సొంత ఊరు. తమ దేశ వృద్ధ వ్యక్తిగా జమైకా ఆమెను గతంలో సత్కరించింది. జమైకా గతంలో బ్రిటీష్ పరిపాలనలో ఉండేది. అప్పుడు ఈమె పుట్టింది. బ్రౌన్ బామ్మ మృతి పట్ల దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. బ్రౌన్కు 96 ఏండ్లు కొడుకు కూడా ఉన్నాడు.