Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెఫరెండం నిర్వహిస్తామంటున్న 'కాటలోనియా' మేయర్లు
బార్సిలోనా : స్పెయిన్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఉన్న 'కాటలోనియా' స్వతంత్ర దేశంగా ఏర్పడాలన్న ఉద్యమం తీవ్రరూపం సంతరించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 1న రెఫరెండం నిర్వహిస్తామన్న కాటలోనియా ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని మాడ్రిడ్‌లోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పటంతో, కాటలోనియాలోని 700 మంది నగర మేయర్లు శనివారంనాడు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాటలోనియాలో రెఫరెండం నిర్వహించి తీరుతామని వారంతా ప్రతిజ్ఞలు చేశారు.