Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన అమెరికా మిలటరీ బడ్జెట్
- బిల్లుకు చట్టసభ ఆమోదం
వాషింగ్టన్ : అమెరికా మిలటరీ బడ్జెట్ భారీగా పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరంలో అమెరికా మిలటరీ 692 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.44 లక్షల కోట్లు) ఖర్చు పెట్టబోతున్నది. దీనికి సంబంధించి మిలటరీ బడ్జెట్ బిల్లును సోమవారం సెనెట్ (89-8 ఓటింగ్‌తో) ఆమోదించింది. ఇందులో 60 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.3.84 లక్షల కోట్లు) ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా... తదితర దేశాల్లో యుద్ధాల కోసం కేటాయిం చారు. అమెరికా రక్షణ వ్యవస్థలో ప్రధానం గా ఉండేవి పదాతి, వైమానిక, నావికా, మెరైన్ దళాలు. ఇందులోని సైనికులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది జీత భత్యాలు, ఆయుధాల తయారీ, కొనుగోలు, నిర్వహణ...మొదలైనవాటి కోసం 40 లక్షల కోట్లదాకా వ్యయం కానున్నదని అంచనా. క్షిపణి కార్యక్రమానికి ఈసారి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా బిల్లుపై ట్రంప్ సంతకం చేయనున్నారు.