Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్ స్కేల్‌పై 7.1 నమోదు
మెక్సికో:మెక్సికోను మరోసారి భూకంపం వణికించింది. మంగళవారం 7.1 తీవ్రతతో మెక్సికో నగరంలో భూమి కంపించింది. భూకంపం ధాటికి భవనాలు ఊగిపోయాయి. దాంతో,నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వీధుల్లోకి పరుగుపెట్టారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు అందాల్సి ఉన్నది. భూకంపం వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రిల్ నిర్వహించిన కొన్ని గంటల్లోనే ప్రకంపనలు రావడం గమనార్హం. 1985లో మెక్సిలో సంభవించిన భూకంపం వల్ల వేలాదిమంది చనిపోయిన ఘటనను స్మరిం చుకుంటూ డ్రిల్లు నిర్వహించారు. ఈ నెల మొదటివారంలో మెక్సికోలో 8.1 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 98మంది మృతి చెందిన విషయం తెలిసిందే.