Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వాధికారమంతా కిరీటధారి బిన్ సల్మాన్ చేతికి
- అడ్డుగా నిలిచినవారిని... 'అవినీతి'తో అరెస్టు
- ఆధునిక సౌదీ అరేబియా చరిత్రలో అనూహ్య మార్పులు
సౌదీ అరేబియాలో నవంబరు 4న చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు
అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆధునిక సౌదీ అరేబియా చరిత్రలో ఇంతదాకా ఇలాంటి రాజకీయ పోకడలు కనపడలేదు. దీనికి కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం...అంతా క్రౌన్ ప్రిన్స్ (కిరీటధారి) మహ్మద్ బిన్ సల్మాన్. రాజప్రాసాదంలో అరెస్టుల వెనుకున్న అసలు మర్మం ఏంటి ? తన రాజకీయ, ఆర్థిక, మత విధానాల్ని అమలుజేయడానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించుకున్నాడన్న దాంట్లో నిజమెంత? అన్నది తెలియజేయడానికి ఈ కథనం...
రియాద్ : పేరుకు సౌదీ ప్రభుత్వమైనా, నడిపేదంతా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్సాద్ కుటుంబం, ఆయన అన్నదమ్ముల పిల్లలు. ఇందులో రాజు మూడో భార్య కుమారుడు...ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ (కిరీటధారి, రాకుమారుడు) మహ్మద్ బిన్ సల్మాన్ శక్తివంతమైన స్థానంలో ఉన్నారు. తండ్రి అబ్దుల్ అజీజ్ అల్సాద్ రాజుగా ఉన్నా, అధికారమంతా కిరీటధారిదేనన్న మాటలు కొన్నాండ్ల నుంచీ వినపడుతున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. కిరీటధారి అయిన సల్మాన్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ అవినీతి నిరోధక కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే, యువరాజులను, మంత్రులను, మాజీ మంత్రులను, ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారుల్ని 'అవినీతి ఆరోపణల' కింద అరెస్టు చేశారు.
'అవినీతిపై పోరాటం' పేరుతో కిరీటధారి బిన్ సల్మాన్ ఇంతటి సాహసోపేత నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అంటే, సమాధానం 'సౌదీ సింహాసనం'అందుకునే క్రమంలో అడ్డం కుల్ని తొలగించుకోవటమేనన్నది సుస్పష్టం. అందుకోసం రాజకుటుంబలో తనకు అడ్డుగా ముఖ్యస్థానాల్లో ఉన్నవారిని మొదట తప్పించాలి. మళ్లీ తిరిగి వారు ఉన్నత పదవుల్లోకి రానంత పెద్ద మచ్చ వారిపై మోపాలి, అన్నదే సల్మాన్ వ్యూహం. కొద్ది గంటల్లోనే ఈ వ్యూహం అమలైంది. అటు ప్రభుత్వంలో, ఇటు రాజకుటుంబంలో కిరీటధారి బిన్ సల్మాన్ పట్టు పెరిగింది. రాజకుటుంబంలోని మరికొం తమంది యువరాజుల నుంచి కూడా అతడికి పూర్తి సహకారం అందింది.
అరెస్టయినవారు అల్లాటప్పా వ్యక్తులు కాదు
రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ వయస్సు 81 సంవత్సరాలు. ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకున్న వయస్సు, ఆరోగ్యసమస్యలరీత్యా ప్రభుత్వ వ్యవహారాలపై పట్టు జారిపోతున్నది. అటు ప్రభుత్వంలో నిజమైన అధికారాల్ని కిరీటధారి బిన్ సల్మాన్ కలిగివున్నారు. దీంతోనే బిన్ సల్మాన్ తృప్తిపడటం లేదు. ముందు ముందు తను సింహాసనం ఎక్కే అవకాశాల్ని అడ్డుకునే వ్యక్తులున్నారని తెలిసి, వారిని ఒక పథకం ప్రకారం పక్కకు తప్పించారు. యువరాజు ఆల్వాలీద్ బిన్ తలాల్ అల్లాటప్పా స్థాయి వ్యక్తి కాదు. బిలియనీర్‌గా ఆయనకున్న పేరు అంతా ఇంతా కాదు. తన ఇమేజ్‌తో బిన్సల్మాన్కు పోటీదారు అయ్యాడు. ఆపిల్, సిటీగ్రూప్ మొదలైన బడాకార్పొరేట్ సంస్థల్లో పెట్టు బడులున్నాయి. అవినీతి ఆరో పణలతో ఇతన్ని కొన్ని గంటల వ్యవధిలో అరెస్టు చేసేశారు. శనివారంనాడు అరెస్టయిన వారిలో పెద్ద తలకాయ, దివం గత రాజు అబ్దుల్లా కుమారుడు, ప్రస్తుత యువ రాజు ముతాబీ బిన్ అబ్దుల్లా ఉన్నాడు. జాతీయ సైనిక దళాలకు చీఫ్‌గా వ్యవ హరిస్తున్నారు. సౌదీ ప్రభుత్వం లోని కీలకమైన శాఖలు ఆర్మీ, అంతర్గత భద్రతా సేవలు, నేషనల్ గార్డ్స్... మొదలైన వాటికి అధిపతులను ప్రస్తుత రాజు, గత రాజు పిల్లలకు అప్ప జెప్పి, పంపకాలు జరిపారు. నవంబరు 4 నాటి అరెస్టులతో మొత్తం అధికారమంతా కిరీట ధారి (క్రౌన్‌ప్రిన్స్) బిన్ సల్మాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆధునిక సౌదీ అరేబియా చరిత్రలో అధికారమంతా ఒక్కరిచేతికి వెళ్లటం ఇదే మొదటిసారి.
అవినీతిపై పోరాటమంటే సౌదీలో నమ్మేవారు లేరు !
కిరీటధారి బిన్ సల్మాన్, యువరాజు ముతాబీ బిన్ అబ్దుల్లా, యువరాజు ఆల్వాలీద్...వీరందరికీ స్వంత ఆస్తులు వేలకోట్లలో ఉన్నాయి. వీరంతా బిలియనీర్లే. ఎలాంటి అవి నీతి, అక్రమాలకు పాల్పడకుండానే వీరంతా బిలియనీర్లు అయ్యారా?అంటే సౌదీలోనే నమ్మేవారు లేరు. అవినీతిపై పోరాటం, విజయం... వంటి పేర్లతో బిన్ సల్మాన్ చేస్తున్న హడావిడి ఇదంతా ! క్రీడా మైదానాల్లోకి మహిళలకు ప్రవేశం, మహిళల డ్రైవింగ్‌కు అనుమతి... వంటి నిర్ణయాల్ని కూడా బిన్ సల్మాన్ వ్యూహాత్మకంగా తీసుకున్నవే. తనను తాను సంస్కరణవాదిగా చూపించుకునే ప్రయత్నం ఇది.
అమెరికాతో దోస్తీ..
ఈ ఏడాది మార్చిలో బిన్ సల్మాన్ సౌదీ తరఫున అమెరికాకు వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసివచ్చాడు. తన తొలి విదేశీ పర్యటన సౌదీకేనని ట్రంప్ దగ్గర మాట తీసుకున్నాడు. ట్రంప్ యితనికి స్టేట్ డైనింగ్ రూములో ప్రత్యేక విందు ఇచ్చాడు. అతని కూతురు ఇవాంకా, అల్లుడు జార్డ్ కుష్నర్ వాళ్లింట్లో మర్యాదలు పొందాడు. ట్రంప్ మేలో సౌదీ వచ్చినపుడు ఆయన కూతురు, అల్లుడికి తన ప్యాలస్‌లో బిన్ సల్మాన్ విందు ఇచ్చాడు. అమెరికాలోని కొత్త ప్రభుత్వాన్ని సౌదీకి అనుకూలంగా మా అబ్బాయి మార్చాడని రాజు మురిసిపోతున్నాడు. సల్మాన్ యుద్ధోన్మాది. ఇరాన్, యెమెన్, ఖతార్‌లపై చేస్తున్న యుద్ధాలు కొనసాగి తీరాలంటాడు. వాటికీ డబ్బు కావాలి. అది దొరకటం లేదు. కారణం ముడి చమురు ధరలు పడిపోవటం, అంతర్గతంగా మరికొన్ని సమస్యలున్నాయి.
వెళ్లీ..వెళ్లగానే అరెస్టుసౌదీ ప్రభుత్వంలో శక్తివంతమైన పదవుల్లో ఒకటి 'నేషనల్ గార్డ్ చీఫ్'. ముతాబీ బిన్ అబ్దుల్లా చీఫ్‌గా ఉన్నారు. నవంబర్ 4న రాత్రి పొద్దుపోయాక కిరీటధారి బిన్ సల్మాన్‌తో అత్యవసర సమావేశం ఉందని ముతాబీ బిన్ అబ్దుల్లాకు ఫోన్ ద్వారా ఆదేశాలు వెళ్లాయి. తన ఫాం హౌస్ నుంచి ముతాబీ ఉన్నపళంగా రియాద్‌కు బయేల్దేరి వెళ్లాడు. అక్కడికి వెళ్లీ..వెళ్లగానే అరెస్టుచేసి, గృహనిర్బంధంలో పెట్టేశారు. సౌదీని శతాబ్దాలపాటు ఏలిన దివంగత రాజు అబ్దుల్లా కుమారుడు, ప్రస్తుత యువరాజు తుర్కీ బిన్ అబ్దుల్లాను ఇలాగే అరెస్టుచేశారు.