Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనోయ్ : . అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదని పుతిన్ చేసిన వ్యాఖ్యలను తాను విశ్వసిస్తున్నట్లు శనివారం ట్రంప్ పేర్కొన్నారు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదంటూ అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలను ఆమోదిస్తున్నారా లేదా అనే అంశంపై గందరగోళాన్ని తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రయత్నించారు. ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, శనివారం తాను పుతిన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దూరం పాటిస్తున్నట్లు తెలిపారు. ''మా ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని పుతిన్ గట్టిగా భావిస్తున్నారని నాకు అనిపిస్తోంది.అయితే ఆయన ఏం నమ్ముతున్నారో అది ఆయన ఇష్టం.'' అని అన్నారు. ఎన్నికల జోక్యంపై పుతిన్‌తో వాదించాలని తానుకోవడం లేదని అన్నారు. ఉత్తరకొరియా, సిరియా, ఉక్రెయిన్లతో సహా ప్రపంచ సమస్యలపై రష్యాతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని ట్రంప్ చెప్పారు. మాస్కోతో కుమ్మక్కై ఎన్నికల ప్రచారం జరిపానన్న ఆరోపణలు వట్టి బూటకమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లార్ దర్యాప్తు నిర్వహిస్తున్నారు.