Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులెన్ అప్పగింతపై రహస్య భేటీ జరగలేదు : ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) మైఖెల్ ఫ్లిన్
వాషింగ్టన్: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ముడుపులకు తానేమీ ఆశపడలేదని యూఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్ ) మైఖెల్ ఫ్లిన్ తెలిపారు. టర్కీలో గతేడాది జులైలో చెలరేగిన సైనిక తిరుగుబాటు విఫలమైన సంగతి తెలిసిందే. ఎర్డోగన్ను గద్దె దించేందుకు అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివసిస్తున్న ఆధ్యాత్మిక గురువు ఫెతుల్లా గులెన్ కుట్ర పన్నినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో టర్కీలో ఉన్న గులెన్ మద్దతుదారులను ఎర్డోగన్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించి జైలుకు పంపింది. గులెన్ను తమకు అప్పగించాలని అమెరికాపై ఒత్తిడి పెంచింది. అయితే, ఈ తిరుగుబాటు వెనుక గులెన్ హస్తం లేదని అమెరికా భావిస్తోంది. గులెన్ను అప్పగించబోమని గతంలో పలుమార్లు టర్కీకి స్పష్టం చేసింది. గులెన్ అప్పగింత విషయమై టర్కీ అధికారులకు, మైఖెల్ ఫ్లిన్ మధ్య రహస్య భేటీ జరిగినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలో మైఖెల్ స్పష్టతనిచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.