Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్ : ' కిమ్ నన్ను 'ఓల్డ్‌మెన్' అంటూ అవమానిస్తున్నారు. నేనూ అతన్ని 'లిటిల్ అండ్ ఫ్యాట్' అని పిలుస్తూ అగౌరవపర్చుతున్నాను. ఇకపై కిమ్‌ను అలా పిలవొద్దని అనుకుంటున్నాను' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. వియత్నాంలో 12రోజుల ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ పై కామెంట్లు చేశారు. 'కిమ్‌తో స్నేహం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. ఏదో ఓ రోజు మేమిద్దరం మంచి స్నేహితులమవుతాం' అంటూ మరో ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ట్రంప్ ఎదుట ప్రస్తావించగా...' కిమ్‌తో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను. ఆయన మాతో స్నేహం చేస్తే ఉత్తరకొరియాకు చాలా మంచిది. ప్రపంచ దేశాలకూ చాలా మంచిది' అని అన్నారు. అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా పంచులు విసురుకుంటున్నారు. ట్రంప్ ఆసియా దేశాల పర్యటనను ఉత్తరకొరియా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరకొరియాపైకీ ఆసియా దేశాలను ఎగదోయాలని ట్రంప్ కుట్రపన్నారని, దానిలో భాగంగానే అన్ని దేశాలను కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఐరాస ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తున్నది. తమ శత్రుదేశమైన దక్షిణ కొరియాను, జపాన్ను తమపై ఎగదోయాలని అమెరికా కుట్ర పన్నిందని, అందుకే తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకు నేందుకు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఉత్తరకొరియా పేర్కొన్నది.