Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్పాటువాదులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్
క్యాటలోనియా : బార్సిలోనాలో నిరసనలు హోరెత్తాయి. క్యాటలోనియా స్వాతంత్య్రం కోసం పోరాడి అరెస్టయిన వేర్పాటువాదులందరినీ బేషరతుగా విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మరీనా బీచ్ నుంచి సగ్రాదా ఫమీలియా చర్చీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, పసుపు వర్ణంలోని రిబ్బన్లను చేబూని అరెస్టయిన వారికి మద్దతుగా నిలిచారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్సిలోనా ర్యాలీలో 7లక్షల 50వేల మంది కాటలోనియా మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. కాగా, స్పెయిన్ నుంచి వైదొలగాలని క్యాటలోనియన్లు ఉధ్యమించిన సంగతి తెలిసిందే. 1922లో ప్రారంభమైన ఈ ఉద్యమం కాలక్రమంలో అణచివేతకు గురైంది. 2006 నుంచి క్యాటలోనియన్లు మలి దశ ఉద్యమం చేపట్టారు. గతనెల 1న నిర్వహించిన రిఫరెండమ్లో స్పెయిన్ నుంచి క్యాటలోనియా వేర్పడాలని కోరుతున్నట్టు 90శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు. క్యాటలోనియాపై తమ పెత్తనమే కొనసాగించాలని స్పెయిన్ భావిస్తోంది.