Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: గగనతలంలో విమానం, హెలికాప్టర్ ఢకొీని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లండ్‌లోని హాల్టన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానయానంలో శిక్షణ ఇచ్చే వైకోమ్ ఎయిర్పార్కు నుంచి బయల్దేరిన ఓ విమానం, హెలికాప్టర్.. రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్ సమీపంలో ఢకొీన్నాయి. ఈ ఘటనలో నలుగురు మతిచెందారు. సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి మ తదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. మతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టమైన వివరాలు లేవు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు యూకే ఎయిర్ ఆక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) అధికారులు వెల్లడిం చారు. ఆకాశంలో విమానం, హెలి కాప్టర్ ఒక్కసారిగా ఎదురొచ్చి ఢకొీన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలి పారు. ఆ సమయంలో తాను గార్డెన్ లోనే ఉన్నానని చెప్పారు. ఢకొీన్న వెంట నే భారీ శబ్దం వచ్చిందని.. వెంటనే రెండూ కుప్పకూలిపోయాయన్నారు.