Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యూనస్ ఎయిర్స్: దక్షిణ అట్లాంటిక్‌లో అదృశ్యమైన అర్జెంటీనా జలాంతర్గామి (శాన్జాన్ సబ్‌మెరైన్) నుంచి 7 శాటిలైట్ కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. వేర్వేరు స్థావరాలకు ఈకాల్స్ వచ్చాయని అన్నా రు. 44మంది సిబ్బందితో ప్రయాణించిన ఈ జలాంతర్గామి ఈనెల15 నుంచి కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. సముద్ర తీరం నుంచి 430కిమీ దూరం ప్రయాణించిన తర్వాత నావీ కమాండ్‌తో ఈ సబ్మెరై న్ శాటిలైట్స్ లింక్స్ తెగిపోయాయి. ఈజలాంతర్గామి ఆచూకీని గుర్తించేం దుకు బ్రిటన్, అమెరికా నావికాదళం అధికారులు సహకరిస్తున్నారు. అర్జెం టీనా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ 7 శాటిలై ట్స్ కాల్స్ నేవీ బేసెస్‌తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. కానీ జలాంత ర్గామిలోని సిబ్బంది సంబంధాలను పునరుద్దరించుకునేందుకు ప్రయత్నిస్తు న్నట్టు అధికారులు భావిస్తున్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్లో ప్రత్యేకతగల అమెరికా కంపెనీ సహకారంతో ఈ సిగల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనెల15 ఉదయం 10.52 గంటల నుంచి మధ్యాహ్నం 3.42 గంటల మధ్యలో ఈ సిగల్స్ వచ్చాయి.