Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగో: చిలీలో అధ్యక్ష ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అధ్యక్ష పీఠం కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, కన్సర్వేటివ్ పార్టీ నేత బాస్టియన్ పినేరా(67) ఫ్రంట్ రన్నర్‌గా నిలుస్తారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ గ్విలియర్కు, పినేరాకు మధ్య మాత్రమే పోటీ ఉంటుందని పేర్కొన్నాయి. 2010నుంచి 2014 వరకు పినేరా చిలీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతానని ఓటర్లకు హామీల వర్షం కురిపించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం 14బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టేందుకైనా తాను సిద్ధమేనని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు హామీ ఇచ్చారు. చిలీ అధ్యక్షుడిగా ఆయన్నే ఎన్నికోవాలని దేశ ప్రజలు భావిస్తున్నారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.