Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించటంతో 19మంది మృతి చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులుత తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ బిజీంగ్లో దాక్సింగ్ జిల్లాలోని జిన్జియాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఓఇంట్లో మంటలు ఒక్కసారిగా చెలరేగి చుట్టుపక్కల వ్యా పించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు మూడు గంట లపాలు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు.