Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెసీలియా : సెలవులో ఉన్నా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు ఆ పోలీసు అధికారి. ఓ చేత్తో నెలల వయసున్న కొడుకుని ఎత్తుకుని.. మరో చేత్తో నేరగాళ్ల ఆట కట్టించాడు. బ్రెజిల్లో జరిగిందీ ఘటన. అసలేం జరిగిందంటే..బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ సౌజా మిలిటరీ పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన విధుల నుంచి సెలవు తీసుకుని భార్య, నెలల కుమారుడితో కలిసి స్థానిక మందుల దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు చోరీకి వచ్చారు. తుపాకీలు పట్టుకుని అక్కడి వారిని బెదిరించి దోచుకోబోయారు. అప్రమత్తమైన సౌజా వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీ తీసి దుండగులపై కాల్పులు జరిపారు. ఓ చేతితో కుమారుడిని ఎత్తుకునే కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఒక దొంగను కాల్చిన తర్వాత.. కుమారుడిని భార్యకు ఇచ్చేసి మరో దుండగుడి పనిపట్టారు. ఈ ఘటనలో చోరీకి వచ్చిన దుండగులు ఇద్దరూ హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి స్థానిక మీడియాలో ప్రసారమైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ పోలీసును పలువురు నెటిజన్లు ప్రశంసించారు.