Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ స్వచ్ఛంద సంస్థ నివేదిక
మాస్కో: రానున్న ఎన్నికల్లో ప్రస్తుత దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గెలుపొందడం ఖాయమని రష్యాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొన్నది. వారం రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిం చినా ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా సునాయాసంగా పుతిన్ గెలుపొంది తీరుతారని ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్ సంస్థ జోస్యం చెప్పింది. పుతిన్ నేతృత్వంలో రష్యా అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్లుతోందని ఆసంస్థ పేర్కొన్నది. మరోసారి దేశాధ్యక్షు డిగా ఎవరిని ఎన్నుకోవాలని భావిస్తున్నారనే అంశంపై ఓటింగ్, అభి ప్రాయసేకరణ చేపట్టింది. తమ సర్వేకి సంబంధించిన వివరాలను ప్రకటిం చింది. దానిలోని వివరాల ప్రకారం...పుతిన్‌కు అనుకూలంగా ఓటేయను న్నట్టు 67శాతం మంది, రష్యా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత వ్లాదిమిర్ జిరీనోవోస్కీకి 8శాతం, గెనడీకి ఓటేయనున్నట్టు 4శాతం, లిబరల్ యోబోక్లో పార్టీకి ఓటేయనున్నట్టు ఒక శాతం మంది ఓటింగ్‌లో ఓట్లు నమోదు చేశారు. పుతిన్ పాలనపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని 80శాతం మంది, పుతిన్‌కు వ్యతిరేకంగా 15శాతం మంది ఓటేశారు. కాగా, రష్యాలో వచ్చే ఏడాది మార్చి 18న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పుతిన్ అమిత ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.