Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగో: చిలీ అధ్యక్ష ఎన్నికల్లో సెబాస్టియన్ పినేరా ఘన విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన మాజీ అధ్యక్షుడు పినేరాకు 54.6శాతం ఓట్లు పోల్‌కాగా, ఆయన ప్రత్యర్థి సెంటర్ లెఫ్ట్ నేత అలెజాండ్రో గులివర్కు 45.4శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇద్దరు నేతల మధ్య హోరాహోరి పోటీ ఉంటుందని గతవారమే ఓపీనియన్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గులివర్కు ప్రస్తుత చిలీ దేశాధ్యక్షుడు మిచెల్లీ బచ్లెట్స్ మద్దతిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం పినేరా మాట్లాడారు. చిలీ పౌరుల్లో ఐక్యత కోసం పాటుపడతానని, దేశాభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనకు మద్దతుగా నిలిచి ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పినేరా మద్దతుదారులు వీధుల్లోకి చేరుకుని తమ నేత గెలుపు సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. కాగా, పినేరా 2010 నుంచి 2014 వరకు చిలీ అధ్యక్షుడిగా పని చేశారు.