Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే ట్రంప్ పర్యటన రద్దు : ది సండే టైమ్స్ కథనం
లండన్: బ్రిటన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రేమ చూపించలేదని ఆ దేశ పర్యటన రద్దు చేసుకున్నారట. ఈ విషయా న్ని ట్రంప్ సన్నిహితుడొకరు అక్కడి మీడియా వర్గాలతో చెప్పినట్టు సమాచారం. 'ది సండే టైమ్స్' కథనం ప్రకారం.. బ్రిటన్‌కు ట్రంప్ రావడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారట. దీనికితోడు లండన్ మేయర్ సాదిక్‌ఖాన్ కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన బ్రిటన్ పర్యటను రద్దు చేసుకున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రభుత్వం ట్రంప్ పర్యటనపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆ దేశానికి వెళ్ల్లానే ఆలోచనను విరమిం చుకున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 26, 27తేదీల్లో లండన్‌లో పర్యటించాల్సి ఉంది. లండన్‌లో అమెరికా ఎంబసీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆయన ఆ కార్యక్రమానికి హాజరుకాబోనని ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. గత ఒబామా ప్రభుత్వం సెంట్రల్ లండన్‌లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని మరో చోటుకు తరలించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒబామా లండన్ ఎంబసీని అత్యంత తక్కువ మొత్తానికి అమ్మేశారని.. ఇది చాలా చెత్త డీల్ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అందుకే తాను కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు.