Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 7.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు ధ్రువీకరించారు. పుక్వికో పట్టణానికి ఈశాన్యంలో 124 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ సంభవించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు సునామీ హెచ్చరికను జారీ చేశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు పరుగుతీశారు. అంతటా తీవ్ర భయాందోళన నెలకొన్నది. భూకంప ప్రమాదంలో ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూ ప్రకంపనలు వచ్చిన ప్రదేశానికి సమీపంలో దాదాపు కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు.