Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టునిస్ : దేశంలో నెలకొన్న నిరుద్యోగం, అధిక ధరలు, దిగజారిన ఆర్థిక పరిస్థితులపై ట్యునీషియా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజధాని టునిస్తో సహా అనేక చోట్ల లక్షలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు జరుపుతున్నారు. జనవరి 7 నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శనల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. 2011లో అప్పటి అధ్యక్షుడు అబెదిన్ బెన్ అలీని గద్దె నుంచి దించివేయటంతో ట్యునీషియా అంతర్యుద్ధంలోకి వెళ్లిపోయింది. రాజకీయ అస్థిరత, హింస దేశ ఆర్థికపరిస్థితిని మరింత దిగజార్చింది. బెన్ అలీని గద్దెదించి ఏడేండ్లయిన సందర్భంగా ఆదివారంనాడు ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో 800 మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు బెజీ కైద్ ఎస్సెబ్సీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని జరిపారు.