Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రన్‌వే నుంచి జారి.. సముద్రం వైపునకు..
- టర్కీలో బోయింగ్ విమాన ప్రమాదం
అంకారా: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 162 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న సముద్రం వైపు దూసుకెళ్లింది. ఈఘటన టర్కీ రాజధాని అంకారాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. టర్కీలోని ట్రాబ్జా న్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 737-800 విమానం రన్‌వేపై మంచు ఎక్కువగా ఉండడంతో అదుపు తప్పి పక్కకు జారిపోయింది. దాంతో రన్‌వేకు సమీపంలోని నల్ల సముద్రం వైపు దూసుకెళ్లింది. అదృష్టం బాగుండి విమానం పూర్తిగా సముద్రంలోకి జారిపోకుండా కొండ అంచున మట్టిలో ఇరుక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పిం ది. వెంటనే గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు ముందుగా విమానంలోని మహిళల్ని, పిల్లల్ని జాగ్రత్త గా బయటికి తరలించారు.
ఆ తరువాత విమానాన్ని బయటికి తీసి మరమ్మతులు చేశారు. విమానం సముద్రంలోకి పడిపోతున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.