Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్గ్రేడ్ : సెర్బియా పార్టీ ప్రముఖ నేత ఐవానోవిక్ (64) దారుణ హత్యకు గురయ్యారు. కొసోవో నగరంలోని సిటిజన్స్ ఇనీషియేటివ్ పార్టీ కార్యాలయం ముందు ఆయనపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఐవానోవిక్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దాడిని ఇనీషియేటివ్ పార్టీ నేత మార్కో డ్యూరిక్ ఖండించారు. ఉగ్రవాదులే ఐవానోవిక్పై దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐవానోవిక్ హత్య నేపథ్యంలో సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హత్యకు పాల్పడ్డ నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.