Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనజీవనం అస్తవ్యస్తం... రద్దయిన 700 విమానాలు
వాషింగ్టన్: అమెరికాను మళ్లీ మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్ ఆగేయ ప్రాంతం, తూర్పు తీర ప్రాంతాల్లో మంచు తుఫాను ప్రభావం అధికంగా ఉంది. ఈ తుఫాను కారణంగా విమానయాన సంస్థలకు మిలియన్ డాలర్ల నష్టం వస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అమెరికా వ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ సుమారు 270 విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. డెల్టా ఎయిర్లైన్స్ మంగళవారం దాదాపు 275 విమానాలు రద్దు చేసింది. బోస్టన్, న్యూయార్క్లలోనూ విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 700లకు పైగా విమానాలు రద్దు చేసినట్టు యునైటెడ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్పియా తదితర ప్రభావిత విమానాశ్రయాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా మంచు పడుతుండడం, కొన్ని అంగుళాల మేర మంచు పేరుకుపోతుండటంతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీని వల్ల విమానయాన సంస్థలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది.వర్జీనియా, ఉత్తర కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా, జార్జియా నగరాల్లో మంచు కురిసినట్టు ఆక్యూవెదర్ సీనియర్ మెటీరియాలజిస్ట్ క్రిస్టినా పిడినౌస్కీ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారని అన్నారు.