Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ సెంటర్ పోల్
మాస్కో : అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పుతిన్ విజయఢంకా మోగిస్తారని రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ సెంటర్ (ఆర్పీఓసీ) వెల్లడించింది. మార్చి 18న రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆర్పీఓసీ సర్వే చేపట్టి ఓ నివేదికను విడుదల చేసింది. దానిలోని వివరాల ప్రకారం...వచ్చే ఆదివారం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించినా తొలి రౌండ్ లోనే పుతిన్ గెలుపొందుతారు. పుతిన్‌కు 81.1శాతం ఓట్లు నమోదవుతాయి. డెమోక్రటిక్ పార్టీ నేత వ్లాదిమిర్ జిరినోవ్స్కీకి 4.2శాతం ఓట్లు, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పావెల్ గ్రడ్నిన్కు 7.6శాతం ఓట్లు వస్తాయి. మెజారిటీ ఓటర్లంతా పుతిన్ మరోసారి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నారు. పుతిన్ గెలుపును ఆకాంక్షిస్తున్నట్టు 10లక్షల మంది ఇప్పటికే సంతకాలు చేశారని ఆర్పీఓసీ సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.