Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి, ఏడుగురికి గాయాలు
డమాస్కస్ : సిరియాలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. సిరియాలోని హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం....హసాక్ ప్రావిన్స్‌లోని ఖమీషీ నగరంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏడుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కారు బాంబు పేలిన ప్రాంతం ప్రస్తుతం కుర్దు తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నది. ఈ ప్రాంతంలో సిరియా సైన్యం మోహరింపు చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో మోటార్ సైకిల్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.