Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికెన్ కొరతే ప్రధాన కారణం
లండన్ : చికెన్ కొరతతో బ్రిటన్‌లో వందల కొద్దీ కేఎఫ్‌సీ సెంటర్లు మూత పడ్డాయి. ఇప్పటి వరకు చికెన్‌ను సరఫరా చేస్తున్న జర్మనీకి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్ఎల్తో ఒప్పందం రద్దుచేసుకోవడంతో కెఎఫ్‌సీకి ఇబ్బందులొచ్చాయి. 'ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ కంపెనీ సరఫరాలో కొన్ని ప్రారంభ సమస్యలు వచ్చాయి. యూకే వ్యాప్తంగా ఉన్న 900 సెంటర్లకు చికెన్ సరఫరా చేయడం కష్టమైంది. ఈ నేపథ్యంలో కొన్ని సెంటర్లు మూసివేయాల్సి వచ్చింది.'అని కేఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. నాణ్యత విషయంలో కంపెనీ రాజీ పడదని, దీంతోనే యూకే వ్యాప్తంగా ఉన్న 900 కేఎఫ్‌సీల్లో 700 వరకు మూసివేసామని పేర్కొంది. పలు స్టోర్స్‌లో లిమిటెడ్ మెనూ, కొన్ని గంటలే సేవలం దిస్తున్నట్టు తెలిపింది. ఈ అసౌకర్యానికి క్షమించాలని వినియోగదారులను కేఎఫ్‌సీ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు.