Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా పేరున్న మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. 2010 నుంచి 2016 వరకు లింగ వివక్ష, లైంగిక వేధింపుల కింద 238 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. గత కొన్నేండ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను, లింగ వివక్షపై చేసిన ఫిర్యాదులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ ప్రతీసారి మహిళా ఉద్యోగుల జీతాల పెంపు, పదోన్నతుల విషయంలో అన్యాయం చేస్తుందని ఈ ఫిర్యాదుల్లో వెల్లడైంది. అయితే ఈ ఫిర్యాదులను మైక్రోసాఫ్ట్ ఖండిస్తోంది. దీనిపై 8 వేల మందికి పైగా మహిళా ఉద్యోగులను పిటిషనర్లుగా చేర్చి ఒక క్లాస్ యాక్షన్ దావాను కూడా మహిళల తరుఫున వాదించే న్యాయవాదులు ఫైల్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా సమర్పించిన లీగల్ ఫైలింగ్స్ మార్చి 12న వెలుగులోకి వచ్చాయి. 238 ఫిర్యాదుల్లో 118 మంది ఫిర్యాదులు లింగ వివక్షకు సంబంధించినవే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులను కంపెనీలు గోప్యంగా ఉంచుతాయి. దీంతో ఎన్ని ఫిర్యాదులు వెల్లువెత్తాయో చెప్పడం కూడా కష్టంగా మారుతోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి నిరాకరించారు. ఇంకా క్లాస్ యాక్షన్ స్టేటస్‌పై అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ రోబార్ట్ కూడా ఎలాంటి తీర్పు ప్రకటించలేదు. మహిళల ఫిర్యాదుల సంఖ్యను సీక్రెట్‌గా ఉంచాలని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది