Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోంపియోకు అమెరికా విదేశాంగ మంత్రి బాధ్యతలు
వాషింగ్టన్ :అమెరికా విదేశాంగ మంత్రి పదవి నుంచి రెక్స్ టిల్లర్సన్ను తొలగిం చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఆయన స్థానంలో సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) డైరెక్టర్ మైక్ పోంపియోను నియమించనున్నట్టు తెలిపారు. టిల్లర్సన్ కంటే పోంపియో సమర్ధవంతంగా విదేశాంగ శాఖ బాధ్యతలు నిర్వర్తించగలరని ట్రంప్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఉత్తర కొరియాతో పాటు పలు దేశాలతో వాణిజ్య సంబంధాలపై అమెరికా కీలక చర్చలు జరుపనుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్ట నున్నట్టు ట్రంప్ గతనెలలో ప్రకటించారు. ఎగ్జాన్మొబిల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ టిల్లర్సన్కు గతేడాది ట్రంప్ అమెరికా విదేశాంగ మంత్రి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.