Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ మియాంగ్ బక్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలు కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొనే నిమిత్తం బుధవారం ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల ఎదుట హాజరయ్యారు. 2013, ఫిబ్రవరిలో ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న లీ, సియోల్ సెంట్రల్ జిల్లాలోని ప్రాసిక్యూటర్ కార్యాలయంలో బుధవారం ఉదయం హాజరైనట్టు స్థానిక టివి ప్రసారం చేసింది. విచారణకు వెళ్ళబోతూ లీ, దక్షిణ కొరియా ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నందుకు క్షమాపణ చెబుతూ ఒక ప్రకటన చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న చివరి అధ్యక్షుడిని తానే కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.