Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగోసారి బాధ్యతల స్వీకరణ
బెర్లిన్: జర్మనీ చట్టసభ సభ్యులు బుధవారం ఏంజెలా మెర్కెల్‌ను మరోసారి ఛాన్స్‌లర్‌గా ఎన్నుకున్నారు. ఆమె ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. రిచ్స్టాగ్లో నిర్వహించిన ఓటింగ్‌లో 364 మంది మద్దతుగా, 315 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 9 మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. 2005లో తొలిసారి ఛాన్స్‌లర్‌గా పదవిలోకి వచ్చిన మెర్కెల్ జర్మనీ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించారు. ఆర్థిక సంక్షోభం నుంచి యూరోపియన్ యూనియన్ను బయటపడేయడంలో ఆమె ఎనలేని కృషి చేశారు. కానీ, 2015లో దేశంలోకి వలసలను అనుమతించడానికి ఆమె తీసుకున్న కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. దాదాపు 10లక్షల మందికి పైగా శరణార్థులు దేశంలోకి వలస వచ్చారు. ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె నాయకత్వం వహించాల్సి వస్తుంది. ఆమె నాయకత్వం వహిస్తున్న కూటమిలో కొంతమంది వలసలను అనుమతించడానికి వ్యతిరేకంగా ఉన్నారు. మున్ముందు ఆమెకు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. మద్దతు తెలుపుతున్న పార్టీల డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.