Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : లైంగిక ఆరోపణల ఉచ్చులో ఆస్కార్ అకాడమీ ప్రెసిడెంట్ చిక్కుకున్నాడు. గత ఏడాది ఆగస్టులో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడిగా ఎంపికైన జాన్ బైలీపై మూడు లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్టు వార్తలు వెలువడ్డాయి. సినిమాటోగ్రాఫర్‌గా అమెరికన్ గిగోలో, ది బిగ్ చిల్ , గ్రౌండ్ హోగ్ డే వంటి సినిమాలకి పనిచేశారు బైలీ. జాన్ బైలీపై వస్తున్న వార్తలపై ఆస్కార్ కమిటీ మెంబర్స్ పూర్తిగా సమీక్షించి ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కి రిపోర్ట్ చేయనుంది. దీనిపై సమగ్ర విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రకటనా చేయబోమని అకాడమీ అనధికారికంగా తెలిపింది. ఒకవేళ బైలీ తప్పుచేశాడని తెలిస్తే అతని స్థానంలో సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ లూయిస్ బుర్ వెల్ అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం లూయిస్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే ఆస్కార్ పండుగ ఈ సారి లాస్ ఏంజెల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్లో మార్చి 4న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 90వ ఆస్కార్ అవార్డుల వేడుకకి ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్ మాన్ (డార్కెస్ట్ హవర్), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్ మెక్ డార్మమండ్ (త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) సొంతం చేసుకున్నారు. 'ద షేప్ ఆఫ్ వాటర్' సినిమాకు గాను గిలెర్మో డెల్ టోరో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా 'ద షేప్ ఆఫ్ వాటర్'కి ఆస్కార్ అవార్డ్ వరించిన విషయం విదితమే.