Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్లో పనిచేసిన కేంబ్రిడ్జ్ అనాలిటికా కంపెనీకి ఫేస్బుక్ కంపెనీ దాని వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అందజేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై యూఎస్ కాంగ్రెస్లో వ్యక్తిగత సమాచార రక్షణపై శనివారం ప్రశ్నల పర్వం మొదలైంది. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు నూతన రెగ్యులేషన్లు తీసుకురావాలని ఫేస్బుక్ కంపెనీని కోరారు. దాదాపు 5కోట్ల మంది వినియోగదారుల సమాచారాన్ని ఫేస్బుక్ దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఫేస్బుక్ సహాయంతో అమెరికా ఓటర్లను రష్యా ప్రభావితం చేసిందన్న ఆరోపణలు ఇది వరకే వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఫేస్బుక్ విశ్వసనీయత ప్రమాదంలో పడింది. 50కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కేంబ్రిడ్జ్ అనాలిటికా కంపెనీల చేతికి వెళ్లిందని న్యూయార్క్ టైమ్స్ శనివారం రిపోర్ట్ చేసింది. అయితే అధ్యక్ష ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనాలిటికా కంపెనీకి ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని వాడుకునే అవకాశాన్ని కల్పించినట్టు ఓ బ్లాగ్లో ఫేస్బుక్ వెల్లడించింది. అయితే వినియోగించిని సమాచారాన్ని ఆ కంపెనీ డిలీట్ చేయలేదని తెలిపింది.