Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల పరిస్థితిపై ఐరాస ఆందోళన
- సిరియాలో లైంగిక దాడులపై తాజా నివేదిక వెల్లడి
వాషింగ్టన్: సిరియాలో మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తేటతెల్లం చేసింది. సాటి మనుషులుగా కూడ మహిళలను చూసే పరిస్థితులు కన్పించడం లేదు. లైంగడిక దాడులతో మహిళలను తీవ్రంగా హింసిస్తున్నారని ఆ నివేదిక బట్ట బయలు చేసింది. సుమారు 450 మందిని విచారించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేసినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.మరో వైపు స్త్రీలతో పాటు పురుషులు కూడా లైంగికదాడులకు గురౌతున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.
సిరియాలో నరమేథం సాగుతోంది. మరో వైపు మహిళలపై యథేచ్చగా లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. సిరియా అంతర్యుద్ధంలో మహిళలు పావులుగా మారుతున్నారు. సభ్యసమాజం తలదించుకొనే రీతిలో మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకొంటున్నాయి. దౌర్జన్యంగా ఇండ్లలోకి వచ్చి మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఆ దేశ మహిళలు వివరించారు.
సోదాల పేరుతో వచ్చి...
సోదాల పేరుతో ఇంట్లోకి వచ్చిన వారు..మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఐరాస నివేదిక తెలింది. తమకు శత్రువులుగా భావించే వారి ఇండ్లను సోదా చేసే పేరుతో దుండగులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు.
ఆయా ప్రాంతాల్లోని మగవారిని లొంగదీసుకొనేందుకు మహిళలను పావుగా వాడుకొంటున్నారు. మహిళలపై లైంగికదాడులు చేస్తూ తాము చెప్పినట్టుగా మగవారు నడుచుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో యుద్ద ట్యాంకులకు ముందే మహిళలను నగంగా నడిపించిన ఘటలను కూడ కొందరు బాధితులు చెప్పారని ఆ నివేదిక వెల్లడించింది.