Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యాలో అధ్యక్ష ఎన్నికలు
మాస్కో: ఆదివారం రష్యాలో ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ విజయం దాదాపు ఖాయమనే చెప్పాలి. దేశంలో ఓటుహక్కు కలిగినవారు 10కోట్లమంది ఉన్నారు. స్థానికకాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలపోటీలో నిలబడ్డ ఏడుగురులో పుతిన్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేస్తున్నాయి. 2000 నుంచి అధ్యక్షుడిగా, ప్రధానిగా రష్యాను పాలిస్తున్న పుతిన్‌కు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు.
ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీ ఖాయమని అనేక సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ఈసారి గెలిస్తే 2024 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. తద్వారా స్టాలిన్ తర్వాత అత్యధికకాలం దేశ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా పుతిన్ రష్యా చరిత్రలో నిలిచిపోనున్నారు. అయితే ఇటీవల జరిగిన రెండు పరిణామాలు ఆయన ఇమేజ్ను కొంత దెబ్బతీసాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకటి- బ్రిటిష్-రష్యా గూఢచారిపై విష రసాయన దాడి కాగా, రెండోది- 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తలదూర్చినందుకు ఆంక్షలు విధించడం.
ప్రీ పోల్ సర్వేలో పుతిన్‌కు 69.7 శాతం మద్దతు దక్కిందని వస్తే.. ఆయన సమీప ప్రత్యర్థి పావెల్ గ్రడినిన్కు 7.1 శాతం మంది మాత్రమే ఓటేశారు. అయితే ఓటర్లలో ప్రస్తుతం ఆసక్తి తగ్గిందని, పోలింగ్ రోజు పుతిన్‌కు మద్దతు తగ్గవచ్చునని పాశ్చాత్య మీడియా వ్యాఖ్యానించింది.