Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ఆస్తినష్టం, తప్పిన ప్రాణ నష్టం
స్కాట్లాండ్ : గ్లాస్గౌ నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో నైట్‌క్లబ్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు దావానలంలా వ్యాపిస్తున్నాయని, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. విక్టోరియా వీధిలో ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతంలోని ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశామని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు.