Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : అమెరికా దాడులను తిప్పిగొట్టాలంటే ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యం కావాలని ఇస్లాం మతగురువు అయాతుల్లా ఖొమైనీ గురువారం పిలుపునిచ్చారు. కాగా, అమెరికా రక్షణ లేకుండా మధ్య ప్రాఛ్యంలోని పలు దేశాల మనుగఢ ప్రశ్నార్థకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖొమైనీ ఖండించారు. ఇస్లామిక్ దేశాల్లో ఐక్యత లోపించడంతోనే ట్రంప్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇస్లామిక్ దేశాలు తమలో తాము శత్రుభావాలను విడనాడాలని కోరారు. అమెరికా మిత్రదేశాలను మట్టికరిపించాలంటే ఇస్లామిక్ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఖొమైనీ ఆకాంక్షించారు.