Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో శిశు జననాల సంఖ్య తగ్గిపోయిందని నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ (ఎన్సీహెచ్ఎస్ ) సంస్థ గురువారం వెల్లడిం చింది. శిశు జననాల సంఖ్య 30 ఏండ్లలో కనిష్టానికి చేరుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది 38.5 లక్షల మంది శిశువులు జన్మించారని తెలిపింది. అధిక సంఖ్యలో 40 నుంచి 44ఏండ్ల మహిళలు శిశువులకు జన్మనిస్తున్నట్టు ఎన్సీహెచ్ఎస్ తన నివేదికలో పేర్కొన్నది. శిశు జననాల సంఖ్య తగ్గిపోవడానికి సంబంధించిన సర్వేను జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ప్రొఫెసర్ డోనా స్ట్రోబినో చేపట్టినట్టు తెలిపింది.