Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లపైకి ప్రవహిస్తున్న లావా
హవాయి: హవాయి దీవుల్లోని కిలౌయా అగ్నిపర్వత విస్ఫోటనంతో ఆ ప్రాంతంలో సంభవించిన భూ ప్రకంపనలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అగ్నిపర్వత విస్ఫోటనంతో వెలువడిన లావా రోడ్లపైకి ప్రవహించింది. విస్ఫోటనంతో ఎగసిపడిన ధూళి గాలిలో 12వేల అడుగుల ఎత్తులో వ్యాపించింది. విస్ఫోటనంతో సంభవించిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.4 పాయింట్లుగా నమోదయ్యాయి. లావా ప్రవాహంతో ఎగసి పడుతున్న మంటలు అగ్నిపర్వత శిఖరానికి 25 మైళ్ల (40 కి.మీ) పరిధికి విస్తరించాయి. దాదాపు పాతికకు పైగా ఇండ్లు ధ్వంసం కావటంతో అక్కడ నివశిస్తున్న దాదాపు 2000 మందిని బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత శిఖరం నుండి ఇప్పటికీ శక్తివంతమైన పేలుళ్లు వెలువడుతున్నాయని, దీనితో లావా ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని హవాయియన్ వోల్కనో అబ్జర్వేటరీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.