Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టేకాఫ్ అవుతుండగా ఘోరప్రమాదం
- విమానంలో 107 మంది ప్రయాణికులు
హవానా: క్యూబా ప్రధాన నగరమైన హవానా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. హవానా విమానాశ్రయం నుంచి మరో నగరమైన హులిగిన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు రాయిటర్స్వార్తా సంస్థ వెల్లడించింది. క్యూబా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలతో కూడిన పొగలు విస్తరించాయి. వెంటనే ఘటనాస్థలికి అగ్నిమాపకశకటాలు చేరుకుని మంటల్ని ఆర్పేపనిలో నిమగమయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నట్టు ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇటీవల ప్రయాణికులకోసం ప్రయివేటు సంస్థలనుంచి తెచ్చిన విమానాలను క్యూబా ఎయిర్‌లైన్స్ వినియోగిస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. అయితే ఎంతమంది ప్రయాణికులు చనిపోయారో..వివరాలు వెల్లడికావాల్సిఉన్నది.