Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : నిబంధనల క్రమం పూర్తయ్యేవరకు హెచ్-4 వీసాలపై తుది నిర్ణయం తీసుకునేది లేదని సీనియర్ అధికారి ప్రకటించారు. హెచ్-1బి వీసాలు కలిగిన ఉద్యోగుల జీవిత భాగస్వాములు పనిచేసుకోవడానికి అనుమతినిచ్చే క్రమాన్ని కొనసాగించాలని, ఒబామా హయాం నాటి నిబంధనను రద్దుచేయవద్దని కోరుతూ 130 మందికి పైగా కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. భారత్లోని ఐటి నిపుణుల్లో ఎక్కువగా కోరేది ఇదే. అమెరికాలో వుంటూ వేలాదిమంది ఇమ్మిగ్రెంట్ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు పనిచేసుకోవడానికి అర్హతను కల్పించే నిబంధనను రద్దుచేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.