Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10ఏండ్ల బాలుడికి అమర్చిన చైనా వైద్యులు
బీజింగ్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా త్రీడీ విధానంతో తయారైన కృత్రిమ దవడను 10 ఏండ్ల బాలుడికి వైద్యులు అమర్చారు. చైనాకు చెందిన చిన్చాంగ్ అనే బాలుడి దవడలో ట్యూమర్ ఉందని గుర్తించిన వైద్యులు దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. అయితే అప్పటినుంచి కింది దవడ పనిచేయటం మానేసింది. దీంతో 3డి విధానంలో తయారు చేసిన దవడను బాలుడికి అమర్చాలని నిశ్చయించుకున్నారు వైద్యులు. బాలుడి దవడకు సరిపోయేలా టైటానియంతో త్రీడీ దవడను తయారుచేయించి అతనికి అమర్చారు. జినాన్లోని షాంగ్‌డాంగ్ యూనివర్శిటీ వైద్యులు మూడు గంటల పాటు కష్టపడి చికిత్సను పూర్తి చేశారు. మూడు నెలల తర్వాత బాలుడు మామూలు స్థితికి చేరుకుంటాడని వైద్యులు తెలిపారు.